మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (10:26 IST)

మటన్ కూర వండి పెట్టలేదని భార్యను రాడ్డుతో కొట్టి మూడో అంతస్తు నుంచి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఆదివారం రోజున మటన్ కూర వండిపెట్టేందుకు నిరాకరించిందనీ భార్యను రాడ్డుతో కొట్టి తన తండ్రి, సోదరుడు సహాయంతో మూడో అంతస్తు నుంచి కిందికితోసేశాడు కసాయి భర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఆదివారం రోజున మటన్ కూర వండిపెట్టేందుకు నిరాకరించిందనీ భార్యను రాడ్డుతో కొట్టి తన తండ్రి, సోదరుడు సహాయంతో మూడో అంతస్తు నుంచి కిందికితోసేశాడు కసాయి భర్త. ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి జారిపడిందని ఇరుగుపొరుగువారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో అతని బండారం బయటపడింది. దీంతో ఈ హత్యకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా పచ్వాన్ కాలనీకి చెందిన మనోజ్ కుమార్, రాణిలు భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. మనోజ్ కుమార్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ప్రతిరోజూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన మనోజ్.. భార్య రాణిని మటన్ కూర వండి పెట్టాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో ఇనుపరాడ్డుతో కొట్టాడు. 
 
దీంతో స్పృహ కోల్పోయిన రాణిని భర్త తన తండ్రి, తమ్ముడితో కలిసి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసి ప్రమాదంగా నమ్మించాడు. అయితే, తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని రాణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మనోజ్‌ తండ్రి, తమ్ముడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మనోజ్ కోసం గాలిస్తున్నారు.