గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (17:49 IST)

ఫోన్ చేయడానికి డబ్బులు లేవు... అప్పు తీసుకోవచ్చా... అమితాబ్‌కు టాటా వినతి

ratan tata
భారత పారిశ్రామిక దగ్గజం రతన్ టాటా దేశంలోని అపర కుబేరుల్లో ఒకరు. వేల కోట్ల రూపాయలకు సంపన్నడు. అధిపతి కూడా. అలాంటి వ్యక్తి బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ వద్ద అప్పు తీసుకున్నారంటే ఎవరైనా నమ్మతారా.. కానీ, ఈవిషయాన్ని నమ్మితీరాల్సింది. 
 
ఇదే విషయంపై బాలీవుడ్ బిగ్ బి అమితాబా మాట్లాడుతూ, రతన్ టాటా గొప్ప మనిషి, ఎంతో మంచి మనిషి అని చెప్పారు. ఆయన తన వద్ద అప్పుగా కొంత మొత్తం తీసుకున్నారు అని చెప్పారు. ఓ సారి తామిద్దరం ఒకే విమానంలో ప్రయాణించాం. హిత్రూ విమానాశ్రయంలో దిగిన తర్వాత తన కోసం ఏ ఒక్క సహాయకుడు రాలేదని ఆయన గ్రహించారు. 
 
ఆ తర్వాత ఫోన్ చేసేందుకు బూత్‌లోకి వెళ్లారు. నేను అక్కడే నిలబడివున్నాను. కొద్దిసేపటికే ఫోనుబూత్‌లోని బయటకు టాటా బయటకు వచ్చారు. నా దగ్గరకి వచ్చి అమితాబ్ మీ దగ్గర నేను కొంత డబ్బు అప్పు తీసుకోవచ్చా అని అడిగారు. ఫోన్ చేయడానికి నా వద్ద డబ్బులు లేవు అని అన్నారు. ఆయన మాటలు నేను నమ్మలేకపోయాను అని చెప్పారు. 
 
ఇకపోతే, రతన్ టాటా నిరాడంబర వ్యక్తి అని, ఆయన సాదాసీదా జీవితాన్ని చూసి స్నేహితులు సైతం ఆశ్చర్యపోతుంటారని అమితాబ్ వెల్లడించారు.