అమ్మ క్యాంటీన్ బోర్డులను తొలగించారు.. డీఎంకే కార్యకర్తలపై వేటు
డీఎంకే పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న క్యాంటీన్ల బోర్డులను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. అది కాస్తా డీఎంకే అధినేత స్టాలిన్ దృష్టికి వెళ్లింది. వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన ఆదేశించారు.
చెన్నై మాజీ మేయర్ సుబ్రమణియన్‌ను స్టాలిన్ ఆదేశించారు. పార్టీ కార్యకర్తలపై సుబ్రమణియన్ చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్ బోర్డులను తిరిగి వాటి స్థానంలో ఏర్పాటు చేశామన్నారు.
దీంతో సొంత పార్టీ కార్యకర్తలపైనే డీఎంకే వేటు వేసింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైలోని చెన్నైలో అమ్మ క్యాంటీన్ బోర్డులు తొలగించినందుకు వారిపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించింది. దాంతో కొందరు డీఎంకే పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న క్యాంటీన్ల బోర్డులను తొలగించారు.