సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (19:11 IST)

ఆస్ట్రేలియా విజయానికి మహాభారత రోజులకు ముడేసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి

markandeya katju
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన పదవీ విరమణ పొందిన జడ్జి మార్కండేయ ఖట్జూ. ఆయన ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఫలితంపై స్పందించారు. భారత జట్టు ఓటమికి గల కారణాలను ఆయన వివరించారు. అలాగే, రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడానికి కూడా ఓ కారణం వెలిబుచ్చారు. ఆసీస్ విజయానికి మహాభారత రోజులకు ఆయన ఏకంగా ముడిపడేశారు. 
 
"ఆస్ట్రేలియా గడ్డ ఆనాడు పాండవులు తమ అస్త్రాలను భద్రపరుచుకునేందుకు కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని అస్త్రాలయ అని పిలిచేవారు. ఆస్ట్రేలియన్లు వరల్డ్ కప్ నెగ్గడానికి అసలైన కారణం ఇదే" అని జస్టిస్ మార్కండేయ ఖట్జూ అన్నారు. దీనిపై నెటిజన్లు స్పందన చూస్తే బిత్తరపోవాల్సిందే. భారత ఓటమిపై ఈ న్యాయకోవిదుడు ఇచ్చిన వివరణకు వారు తలోరకంగా స్పందిస్తున్నారు. 
 
విరాట్ కోహ్లీని ఓదార్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. జెర్చీని బహుకరించిన కోహ్లీ  
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరం ముగింది. ఆదివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో భావోద్వేగ సన్నివేశాలు నెలకొన్నాయి. మైదానంలో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓదార్చారు. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు కోహ్లీ తన జెర్సీని బహుమతిగా అందజేశాడు. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ వద్దకు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆత్మీయంగా మాట్లాడారు. ఓటమి బాధలో ఉన్న కోహ్లీని ఓదార్చాడు. అంతేకాకుండా కోహ్లీ నుంచి గుర్తుగా ఓ జెర్సీని కూడా తీసుకున్నాడు. ఈ ఎమోషన్ మూమెంట్స్‌ను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
కాగా, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండటం తెలిసిందే. ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడిన మ్యాక్స్‌వెల్ 2021 నుంచి ఆర్బీసీ తరపున ఆడుతున్నాడు. బెంగుళూరు జట్టుకు మారిన తర్వాత అతని ఆటతీరులో కూడా మార్పు వచ్చి స్థిరంగా రాణిస్తున్నాడు.