ఫేస్బుక్ ఫ్రెండ్.. ఇంటికి రమ్మన్నాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు
సోషల్ మీడియాతో ప్రజలు పొందే మేలు కొంతే అయినా.. కీడు మాత్రం అధికమేనని చెప్పాలి. తాజాగా సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో స్నేహితుడయ్యాడని నమ్మి అతనింటికి వెళ్లిన పాపానికి 16 ఏళ్ల బాలిక దారుణంగా మోసపోయిన ఘటన
సోషల్ మీడియాతో ప్రజలు పొందే మేలు కొంతే అయినా.. కీడు మాత్రం అధికమేనని చెప్పాలి. తాజాగా సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో స్నేహితుడయ్యాడని నమ్మి అతనింటికి వెళ్లిన పాపానికి 16 ఏళ్ల బాలిక దారుణంగా మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. డానియెల్ (24) అనే యువకుడికి ఆరు నెలల క్రితం ఫేస్బుక్లో బాధితురాలు పరిచయం అయ్యింది. వీరిద్దరి పరిచయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వీరిద్దరికీ కామన్ బర్త్ డే పార్టీ ఉందని.. బాధితురాలిని డానియెల్ ఇంటికి రమ్మన్నాడు. ఆతడిని నమ్మి ఇంటికొచ్చిన బాధితురాలికి డానియెల్ మత్తు మందిచ్చిన శీతల పానీయాన్ని ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని ఆమె తెలుసుకుంది. ఘటనను వీడియో తీశానని, ఎవరికైనా చెబితే దాన్ని ఆన్ లైన్లో పెడతానని బెదిరించాడు. ఆపై బాధితురాలిని ఇంట్లో దింపాడు. బాధితురాలు భయపడకుండా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పేయడంతో డానియెల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.