సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (12:28 IST)

భవానీపూర్ బైపోల్ : గెలుపు దిశగా మమతా బెనర్జీ

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. 
 
ఆదివారం ఉదయం నుంచి పట్టిన ఓట్ల లెక్కింపులో స‌మీప ప్ర‌త్యర్థి అయిన బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి సీఎం మమతా బెనర్జీ 25 వేలకుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఏడో రౌండ్ వ‌రకూ మ‌మ‌త‌కు 31,033 ఓట్లు, ప్రియాంకాకు 5719 ఓట్లు వ‌చ్చాయి. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మ‌మ‌తా.. బీజేపీ నేత సువేందు చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె ఉప ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ నుంచి పోటీ చేశారు. ఆమె విజ‌యం దాదాపు ఖాయం కావ‌డంతో మ‌మ‌తా ఇంటి ముందు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు సంబరాలు చేసుకుంటున్నారు.