సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (13:28 IST)

అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వస్తే.. రెండు రోజులు రేప్ చేశాడు..

ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి

ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టడానికి వచ్చిన సోదరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బంద నగరం తింద్వారీకి చెందిన 15 సంవత్సరాల బాలిక రక్షాబంధన్‌ రోజున అన్నయ్య వరసయ్యే యువకుడికి రాఖీ కట్టడానికి అతని ఇంటికి వెళ్లింది. అదే అదునుగా తీసుకున్న ఆ కీచకుడు బాలికను బంధించాడు. 
 
రెండు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.