శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (15:37 IST)

సెనెగల్‌ సముద్రంలో పడవ బోల్తా : 13 మంది మృతి

Boat Capsizes
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన సెనెగల్‌లో పెను విషాదం సంభవించింది. కొందరు వలసదారులతో ఐరోపాకు వెళ్తున్న పడవ ఒకటి సముద్రంలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందినట్టు రెడ్‌ క్రాస్‌ అధికారులు వెల్లడించారు. 
 
దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదం సమయంలో బోటులో దాదాపు 150 మందికి పైగా ఉన్నారు. వీరిలో 91మందిని రక్షించగలిగినట్టు, మరో 40మందికి పైగా గల్లంతైనట్టు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది తెలిపారు. 
 
ఈ బోటులో మంటలు వ్యాపించడం వల్లే బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అసలు ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటి? ఈ బోటుకు, మైగ్రేషన్‌ ఆపరేషన్‌కు ఇన్‌ఛార్జి ఎవరు? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.