గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (15:20 IST)

కాబోయే భార్యే కదాని.. ఎంగేజ్‌మెంట్‌కు ముందు రేప్ చేయబోయాడు.. అరిచేయడంతో పెళ్లికి నో..?!

పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక కాబోయే భార్యే కదా అనుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌కు ఇంకా రెండు రోజుల ముందే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు వరుడు. ఈ ఘటన కాజీపేట జిల్లా చింతల్ బస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక కాబోయే భార్యే కదా అనుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌కు ఇంకా రెండు రోజుల ముందే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు వరుడు. ఈ ఘటన కాజీపేట జిల్లా చింతల్ బస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాజీపేట జిల్లా చింతల్ బస్తీకి చెందిన ఓ యువతికి గత నెల 22వ తేదీ హసన్ పర్తి మండలం, వంగపహడ్ గ్రామానికి చెందిన పొన్నాల ప్రభుదాస్ అనే యువకుడితో నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు. 
 
కట్నకానుకలు కూడా మాట్లాడుకున్నారు. వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కాబోయే భార్య కదా అనుకుని గత నెల 20వ తేదీన పెళ్లికూతురి ఇంటికి వచ్చాడు వరుడు. వధువు ఒక్కతే ఇంట్లో ఉండగా, అదే అదనుగా తీసుకుని ఆమెను లోబరుచుకోవాలనుకున్నాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు కేకలు పెట్టేసింది. ప్రభుదాస్ పారిపోయాడు. 
 
ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు బాధితురాలు తెలిపింది. అయితే ప్రభుదాస్ కుటుంబీకులు వధువును పెళ్లి చేసుకునేది లేదని తేల్చేశారు. అదనపు కట్నం ఇస్తేనే బాధితురాలిని వివాసం చేసుకుంటామని ప్రభుదాస్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.