మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 15 మే 2019 (16:37 IST)

వికారాబాద్ భద్రేశ్వర స్వామని దర్శించుకున్న యడ్యూరప్ప... ప్రభుత్వం పడిపోతుందట...

వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని భావిగి భద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి త్వరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వం పడిపోవడంలో తమ ప్రమేయం ఏమీ వుండదన్నారు. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తమ బలం మరింత పెరగనుందన్నారు. ర్ణాటకలో 20-22 ఎంపీ సీట్లు, తెలంగాణ మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ స్థానాలను గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. 
 
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో బిజెపికి 280 సీట్లు వస్తాయని, కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని, నమో మళ్ళీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. చూడండి ఆయన మాటల్లోనే...