క్రాకర్స్ కాల్చడంపై నిషేధం.. దీపావళి రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకే..
దీపావళికి క్రాకర్స్ కాల్చడంతో పాటు వాటి అమ్మకానికి బ్రేక్ వేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. కేవలం గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చేందుకు మాత్రమే బెంగాల్ ప్రభుత్వం అనుమతించింది. ఈ టపాసులను కూడా కేవలం రెండు గంటల్లోనే కాల్చాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాలని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్రాకర్స్‌పై బ్యాన్ విధించారు.
టపాసులు కాల్చడంతో విడుదలయ్యే హానికారక రసాయనలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, హోం ఐసోలేషన్‌లో ఉండే కోవిడ్-19 రోగుల ఆరోగ్యాన్ని ఇది మరింత క్షీణింపచేస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.