శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (09:41 IST)

భారత్ జోడో యాత్ర : రాహుల్ గాంధీపై కేసు నమోదు

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఆయన గత కొన్న రోజులుగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి నుంచి ప్రారంభమై కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. 
 
పాదయాత్రలో "కేజీఎఫ్-2" చిత్రంలోని పాటలను వినియోగించారంటూ రాహుల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 'కేజీఎఫ్-2' పాటలపై హక్కులను కలిగివున్న బెంగుళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కాపీరైట్ ఉల్లంఘనల చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ చిత్రంలోని హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుడా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో వీడియోలు రూపొందిస్తున్నారంటూ ఎమ్మార్టీ మ్యూజిక్ కంపెనీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.