ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Chitra
Last Modified: బుధవారం, 31 ఆగస్టు 2016 (14:31 IST)

మూడవ అంతస్తు నుంచి కుక్కను విసిరిన శాడిస్ట్ మెడికోలకు రూ. 2 లక్షల జరిమానా

జంతువులతో ఆటలాడుకుంటే మూగజీవాల ప్రేమికులు చూస్తూ ఊరుకోరనేందుకు ఇది నిదర్శనం. ఆమధ్య చెన్నైలో మూడవ అంతస్తు నుంచి ఓ మెడికో కుక్కను విసిరేసి... అది కుయ్యోమని భయంతో అరుస్తూ కిందపడుతుంటే పైశాచిక ఆనందం పొందిన సంగతి తెలిసిందే. అతడు అలా కుక్కను డాబా పైనుంచి క

జంతువులతో ఆటలాడుకుంటే మూగజీవాల ప్రేమికులు చూస్తూ ఊరుకోరనేందుకు ఇది నిదర్శనం. ఆమధ్య చెన్నైలో మూడవ అంతస్తు నుంచి ఓ మెడికో కుక్కను విసిరేసి... అది కుయ్యోమని భయంతో అరుస్తూ కిందపడుతుంటే పైశాచిక ఆనందం పొందిన సంగతి తెలిసిందే. అతడు అలా కుక్కను డాబా పైనుంచి కింద పడవేస్తుంటే మరో స్నేహితుడు ఈ పైశాచిక క్రీడనంతా తన వీడియోలో చిత్రీకరించాడు. అలా చేసింది కాక అదేదో ఘనకార్యమన్నట్లు మొత్తాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోకి ఎక్కించారు. అది కాస్తా అలా అలా మూగజీవాలను రక్షించే సంస్థలకు చేరింది. దాంతో వారిపై కేసులు పెట్టారు.
 
దాని ఫలితంగా ఇప్పుడు ఆ ఇద్దరు మెడికోలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా పడింది. ఈ మేరకు డాక్టర్‌ ఎంజీఆర్‌ మెడికల్‌ వర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. కుక్కను విసిరేసిన కేసులో చెన్నైలోని మాదా మెడికల్ కాలేజికి చెందిన గౌతమ్ సుదర్శన్, ఆశిష్ పాల్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది.
 
ఐతే వారు హేపీగా తిరుగుతున్నారు కానీ గాయపడిన కుక్కను భద్ర అనే సామాజిక కార్యకర్త కాపాడి చికిత్స చేయించారు. అతడు ఆ ఇద్దరు మెడికోలను శిక్షించడంతో పాటు కుక్క చికిత్సకు సరిపోయే నష్టపరిహారాన్ని ఇప్పించాలంటూ కోర్టులో పిటీషన్ వేశారు. దీనితో కోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ ఎంజీ ఆర్ మెడికల్ యూనివర్శటీ నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ సిఫారసుల మేరకు గౌతమ్ సుదర్శన్, ఆశిష్ పాల్‌కు రూ. 2 లక్షల చొప్పున జరిమానా విధించనట్లు వైస్ ఛాన్స్‌లర్ డి. గీతాలక్ష్మి తెలిపారు. ఇకపై మూగజీవాలతో చెలగాటమాడేవారికి ఇది గుణపాఠం కాగలదని చెప్పారు.