ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 17 డిశెంబరు 2020 (20:02 IST)

డిన్నర్ కోసం ఫ్రెండ్ ఇంటికెళ్లిన లేడీ సీఐడీ ఆఫీసర్, శవమైంది

బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సీఐడీ అధికారి ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కని వెళ్లి ఆ ఇంట్లో శవమై తేలింది.
 
పూర్తి వివరాలు చూస్తే... 33 ఏళ్ల సీఐడీ మహిళా అధికారి లక్ష్మి నిన్న రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్‌కని వెళ్లారు. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
2014లో సీఐడీ పరీక్షలో ఉత్తీర్ణురాలయిన లక్ష్మి 2017లో విధుల్లో చేరారు. ఐతే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియాల్సి వుంది.