మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (13:11 IST)

టీచర్ టిఫిన్ బాక్సులు శుభ్రం చేసే విద్యార్థిని.. వీడియో వైరల్

తంజావూరుకు సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల టిఫిన్ బాక్సులు శుభ్రం చేస్తున్న విద్యార్థిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ టీచర్ ఆహారం తీసుకున్న తర్వాత ఆ లంచ్ బాక్సులను ఓ విద్యార్థిని శుభ్రం చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను.. ఉపాధ్యాయులు తమ సొంత పనికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తంజావూరు ప్రాంతంలోని ఓ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ తిన్న టిఫిన్ బాక్సులను ఓ విద్యార్థిని శుభ్రం చేస్తున్నట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తంజావూరులోని ప్రాథమిక పాఠశాలలో తైయల్ నాయకి హెడ్ మాస్టర్‌గా పనిచేస్తోంది. ఈ పాఠశాలలో మొత్తం 45 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ వీడియో ఆధారంగా జరిపిన విచారణలో ఉపాధ్యాయులకు విద్యార్థులే భోజనాలు తెస్తుంటారని, ఆపై వారు భోంచేసిన తర్వాత ఆ పాత్రలను శుభ్రం చేసి కూడా పెడతారని తెలిసింది.
 
ఉపాధ్యాయుల మీదున్న ప్రేమతో టిఫిన్ బాక్సులు శుభ్రం చేసి ఇస్తామని విద్యార్థులే ముందుకు వస్తారని.. తాము చెప్పకపోయినా ఆ పని చేసిపెడతారని చెప్పారు. కానీ ఇలాంటి వీడియోలను పనిపాటా లేని వాళ్లే పోస్టు చేస్తుంటారని పాఠశాల యాజమాన్యం కొట్టిపారేసింది.