గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (14:16 IST)

సిమ్లా కంటే రమణీయమైన ప్రదేశం గూడలూకు : రాహుల్ గాంధీ

rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను విజయవంతంగా సాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం ఆయన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. భారతదేశం ఒక రాష్ట్రం, ఒక భాషను మాట్లాడే ప్రజలు కాదన్నారు. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు అనేక సంస్కృతుల సమూహారమే భారత్ అని గుర్తుచేశారు. అలాంటి దేశంలో ఎలాంటి కల్మషాలు, కుళ్లుకుతంత్రాలు లేకుండా జీవించే ప్రజల మధ్య చిచ్చు పెడుతూ దేశంలో అంశాంతిని రాజేస్తుందన్నారు. 
 
ఉత్తరభారతదేశంలోని సిమ్లా కంటే ఈ గూడలూరు ఎంతో అందమైన, రమణీయమైన ప్రాంతమన్నారు. ఎందుకంటే.. ఈ ప్రాంతం చుట్టూత ఎత్తైన కొండలు, ఎంతో అందమైన పచ్చటి ప్రకృతికి ఆలవాలంగా ఉందన్నారు. పైగా, మూడు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. 
 
ఈ ప్రాతంలో తమిళం, కన్నడం, మలయాళ భాషలు మాట్లాడే ప్రజలు, మూడు విభిన్న సంస్కృతుల ప్రజలు ఐకమత్యంతో ఉంటున్నారన్నారు. ఇలాంటి వాతావరణమే దేశ వ్యాప్తంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశమని రాహుల్ గాంధీ వివరించారు. ఇదిలావుండగా ఆయన యాత్ర శుక్రవారం కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ఈ యాత్రంలో 21 రోజుల పాటు కొనసాగనుంది.