శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (21:43 IST)

అయ్యో పాపం.. కరోనా అనుకుని ఆత్మహత్య.. కానీ నెగటివ్ అని వచ్చింది..!

కరోనా భయంతో కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. వారికి మరణానంతరం వారికి జరిపిన పరీక్షల్లో ఇద్దరికీ కరోనా నెగటివ్ అని వచ్చింది. కర్ణాటకలోని మంగళూరుల చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రమేశ్ కుమార్ (40), గుణ (35)లు భార్యభర్తలు. మంగళూరు చిత్రపూర్లోని రహేజా అపార్ట్మెంట్లో నివాసిస్తున్నారు. ఇటీవల రమేశ్.. స్థానిక పోలీసు అధికారికి వాయిస్ మెసేజ్ పెట్టాడు తనకు, తన భార్యకు కరోనా సోకిందని కావున ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. తమ అంత్యక్రియలు జరిపించాలని కోరారు. అయితే ఆ పోలీసుల అధికారి వారికి వెంటనే స్పందించి ఆత్మహత్యకు చేసుకోవద్దని చెప్పాడు. కానీ రమేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. 
 
ఫోన్‌ను ట్రేస్ చేసి 20 నిమిషాల్లో వారున్న అపార్టుమెంట్ కు పోలీసు సిబ్బందికరోనా సోకిందని దంపతుల ఆత్మహత్య..అంతకు ముందు పోలీసులకు ఫోన్ వెళ్లారు. కానీ అప్పటికే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
 
అయితే వారు ఇంకో వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. తమ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలని, తమ అంత్యక్రియలకు రూ.లక్షను ఉంచుతున్నామని అందులో చెప్పారు. అలాగే అక్కడ గుణ రాసిన ఓ సూసైడ్ లేఖ కూడా ఉంది. తన ఇంట్లో ఉన్న సామానును పేదలకు పంచాలని కోరింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో మృతదేహాలకు కోవిడ్ పరీక్ష చేయగా వారికి కోవిడ్ నెగటీవ్ అని తేలింది. కోవిడ్ వస్తే భయపడవద్దని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.