ఢిల్లీలో ప్రైవేటు హాస్పిటళ్లతో రెస్టారెంట్ల అనుసంధానం.. కారణం...?
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యను పెంచుతోంది. ఢిల్లీలోని 11 ప్రభుత్వ ఆసుపత్రులలోని 4,503 బెడ్లను 5,221 వరకూ పెంచారు. ఇదేవిధంగా 11 హాస్పిటళ్లలో ఐసీయూ, వెంటిలేటర్ల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పుడు తాజాగా కరోనా బాధితుల కోసం ప్రైవేటు హాస్పిటళ్లలో రెస్టారెంట్లను అనుసంధానం చేశారు.
ఈ విధమైన ఏర్పాటుతో ప్రైవేటు ఆసుపత్రులలో అదనంగా మరో 2,394 బెడ్లు సమూకూరుతాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రులతో అనుసంధానమైన రెస్టారెంట్లలో చేరే బాధితులను కొన్ని నిబంధనల మేరకు చేర్చుకుంటారు. బాధితుల ఆరోగ్యం విషమించే పరిస్థితులు తలెత్తితే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాల్సివుంటుంది. ఇలా ఆసుపత్రులతో అనుసంధానమైన రెస్టారెంట్లలో చేరే బాధితుల నుంచి అత్యధికంగా రూ. 5 వేలు వరకూ వసూలు చేయనున్నారు.