శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:55 IST)

పిజ్జా డెలివరీ ఏజెంట్‌కు కరోనా వైరస్.. 72 కుటుంబాల సంగతి? (video)

పిజ్జా డెలివరీ ఏజెంట్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ ఏజెంట్‌కు కరోనా వైరస్ సంక్రమించడంతో 72 కుటుంబాలను క్వారెంటైన్ చేశారు. ఆయా వ్యక్తులను ఇంట్లోనే క్వారెంటైన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ వారికి లక్షణాలు కనిపిస్తే, అప్పుడు కరోనా పరీక్షలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం లాక్ డౌన్ రెండో దశకు చేరుకుంది. మే మూడో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. పిజ్జా బాయ్‌కు కరోనా సోకిన అంశంపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. పిజ్జా బాయ్‌తో లింకున్న మరో 17 డెలివరీ బాయ్స్‌ను ఇన్‌స్టిట్యూషనల్ క్వారెంటైన్‌లో పెట్టినట్లు వెల్లడించారు. 72 కుటుంబాలను మంది హోం క్వారెంటైన్‌లో పెట్టినట్లు వెల్లడించారు.
 
ఈ క్రమంలో న్యూఢిల్లీలోని మాలవీయ నగర్‌కు చెందిన 72 కుటుంబాలు 15 రోజులుగా తరచూ పిజ్జాను ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటూ వచ్చారు. ఒకే ప్రాంతం కావడం వల్ల ఒకే వ్యక్తి ఆయా కుటుంబాలందరికీ పిజ్జాను డెలివరీ చేశారు. 
 
ఈ ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల తరువాత.. ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అయ్యారు. ఆయనకు పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ డెలివరీ బాయ్ కరోనా వైరస్ పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని దక్షిణ ఢిల్లీ ప్రాంత మెజిస్ట్రేట్ బీఎం మిశ్రా తెలిపారు.