శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (09:53 IST)

అత్యాచారం చేసిన చోటే చంపి పాతేశారు... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిపై తరచూ లైంగిక దాడి చేయడమే కాకుండా కొంతమందిని చంపేసి అదే ప్రాంతంలో నాలుగ్గోడల మధ్య పాతి పెట్టినట్టు కనుగొన్నారు.
 
ఇటీవలే ఓ అమ్మాయిని చంపి అదే ప్రాంతంలో పాతి పెట్టారని కొందరు చెప్పడంతో, మృతదేహాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. ఇక్కడ  44 మంది మైనర్ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 21 మందిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు నెల రోజుల క్రితం ఈ ఉదంతం వెలుగులోకి రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.