సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (08:43 IST)

బీజేపీలో దుర్యోదనుడు, దుశ్శాసనుడు: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంపై మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారిరువరూ బీజేపీలోనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో అత్యంత ప్రమాదకరమైన తుక్డే తుక్డే గ్యాంగులు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారి పేరు ఒకరు దుర్యోదనుడు, మరొకరు దుశ్శాసనుడు. వారిద్దరూ బీజేపీలోనే ఉన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి’’ ఆయన ట్వీట్ చేశారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. ఈ చట్టం దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని ఉదహరిస్తూనే యశ్వంత్ సిన్హా  విమర్శలు చేశారనేది స్పష్టం.