బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:33 IST)

బాలికపై అత్యాచారం-బహిరంగంగా ఉరితీశారు..

బాలికపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన కామాంధుడిని ఇరాన్ సర్కార్ బహిరంగంగా ఉరితీసింది. వివరాల్లోకి వెళితే.. అర్దేబిల్ ప్రావిన్స్‌లోని పర్సబాద్ పట్టణంలో ప్రజలు, అధికారులు ముందు ఇస్మాయిల్‌ను బహిరంగం

బాలికపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన కామాంధుడిని ఇరాన్ సర్కార్ బహిరంగంగా ఉరితీసింది. వివరాల్లోకి వెళితే.. అర్దేబిల్ ప్రావిన్స్‌లోని పర్సబాద్ పట్టణంలో ప్రజలు, అధికారులు ముందు ఇస్మాయిల్‌ను బహిరంగంగా ఉరితీసిన వీడియోను ఇరాన్ మీడియా వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. 
 
సైకోలాగా ప్రవర్తిస్తూ ఏడేళ్ల బాలిక ప్రాణాలు బలితీసుకున్న 42 ఏళ్ల ఇస్మాయిల్ జాఫర్దేశ్‌ను ప్రజలందరి ముందు ఉరితీసింది. అభద్రతా భావం, సమస్యాత్మక వాతావరణంలో ఉన్న ఇరాన్ ప్రజలకు ఇస్మాయిల్ ఉరితీత ఉపశమనం లాంటిదని అర్దేబిల్ ప్రాసిక్యూటర్ నజీర్ అతబాతి ప్రకటనలో చెప్పారు.