మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (13:25 IST)

నా పేరు స్టాలిన్ అనేసరికి.. వింతగా చూశారు.. భయపడ్డారు.. డీఎంకే చీఫ్

స్టాలిన్.. ఓ కరుడుగట్టిన నియంతగా పేరుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరు కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెలియజేశారు. 
 
అంతేగాకుండా.. రష్యా టూర్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నా పేరు స్టాలిన్ అన్ని చెప్పగానే రష్యాలో ప్రజలు తన వంక వింతగా చూశారని, భయపడ్డారని స్టాలిన్ చెప్పుకొచ్చారు. రష్యన్లు తమ కనురెప్పలు పైకి లేపి మరీ తనను చూశారని వెల్లడించారు. 
 
''రష్యా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన మరుక్షణమే, నా పేరు అడిగారు. నా పేరు స్టాలిన్ అని చెప్పగానే ఎయిర్ పోర్టు సిబ్బంది వింతగా చూశారు. భయంగా కనిపించారు. నా పాస్ పోర్టు చెక్ చేసే సమయంలో నన్ను అనేక ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాతే నన్ను లోనికి అనుమతించారు. ఇది 1989లో రష్యా ట్రిప్ లో నాకు ఎదురైన అనుభవం '' అని స్టాలిన్ వివరించారు.