శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (14:36 IST)

రైల్వే ట్రాకుల పక్కన కాగితాలు ఏరుకునే తండ్రీకూతుళ్లు 2000 మందిని కాపాడారు

ఇతని పేరు స్వపన్ దిబ్రామ, రైల్వే ట్రాకుల పక్కన కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుని వాటిని అమ్ముకుని బ్రతుకుతుంటాడు. పక్కనున్న అమ్మాయి అతని కూతురు. రోజులానే రైల్వేట్రాకు పక్కన కాగితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపోయి కనిపించింది. త్రిపురలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ భూమి కోసుకు పోయి, అక్కడ పట్టాలు విరిగిపొయాయి. అంతలొ అటువైపు నుండి 2000 మంది పాసింజర్లతొ ట్రైన్ వస్తుంది.
 
రైలు రావడాన్ని చూసిన స్వపన్ దిబ్రామ, అతని కూతురు వెంటనే తమ చొక్కాలను విప్పి, ట్రైన్ ఆపమని చొక్కాలను ఊపుతూ ఆ రైలుకు ఎదురుగా పరుగెత్తుకెళ్ళి, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రైలును ఆపివేయించారు. దిబ్రామ, అతని కూతురు చేసిన ఈ సాహసం వలన దాదాపు 2000 మంది ప్రాణాలు కాపాడబడ్దాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న త్రిపుర మంత్రి "రాయ్ బర్మన్", వీరిద్దరిని అతని అధికార నివాసానికి పిలిపించి, ఇద్దరికీ మంచి బట్టలు కొనిపెట్టి, VIP లు డిన్నర్ చేసే చోట తండ్రికూతుళ్లతో కలిసి భొజనం చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితొ పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించనుంది.