మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (13:56 IST)

ఎయిమ్స్ ఎండోస్కోపిక్ విభాగంలో అగ్నిప్రమాదం

aiims fire
ఢిల్లీలోని అఖిల భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్)లోని ఎండోస్కోపిక్ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదం రెండో అంతస్తులో జరిగింది. దీంతో ఆ వార్డులో ఉన్న రోగులతో పాటు సిబ్బందిని అత్యవసరంగా మరో ప్రాంతానికి తరలించారు. 
 
రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని వారందరినీ బయటకు పంపించి, అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మొత్తం తొమ్మిది ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
 
'నేను పరమశివుడిని... నిన్ను చంపి మళ్లీ బతికిస్తా'...
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో 70 యేళ్ల వృద్ధుడు కిరాతకంగా ప్రవర్తించాడు. నేను పరమశివుడిని .. నిన్ను చంపి మళ్లీ బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటనను ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి ప్రత్యక్షంగా చూశారు. పైగా, ఈ దారుణ దృశ్యాలను తమ మొబైల్ ఫోనులో చిత్రీకరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి, కిరాతక చర్యకు పాల్పడిన వృద్ధుడిని అరెస్టు చేశారు. 
 
ఈ జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ (70) అనే వృద్ధుడు పూటుగా మద్యం సేవించాడు. దీంతో కైపు తలకు బాగా ఎక్కింది. సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ వృద్ధురాలు కల్కిబాయ్ గమేతి (85)పై తన ప్రతాపం చూపించాడు. తాను పరమ శివుడిని అంటూ ఊగిపోతూ మహిళ ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దెబ్బలకు తాళలేక ఆ వృద్ధురాలు కిందపడిపోయింది. 
 
అయినప్పటికీ వదిలిపెట్టిన ప్రతాప్ సింగ్.. తన చేతిలో ఉన్న గొడుగుతో ఆమెను చావబాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన సమయంలో అక్కడ ప్రతాప్ సింగ్‌తో పాటు ఇద్దరు మైనర్లు, నాథూసింగ్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారిలో ఒకరు ఈ దారుణ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించారు. కాగా, వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్ ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు.