గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (13:33 IST)

అయోధ్యలో నిర్మించనున్న మసీదు మోడల్ ఇదే.. పిక్ వైరల్

దశాబ్దాల కాలంనాటి వివాదాస్పద బాబ్రీ మసీదు వివాదానికి ఇటీవలే పరిష్కారమైంది. బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని రామాలయ నిర్మాణానికి అప్పగించిన విషయంతెల్సిందే. ఈ మేరకు గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేసమయంలో రామాలయం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నాయి. 
 
అదేసమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్మిస్తామని, ఆ పక్కనే ఓ అత్యాధునిక అసుపత్రి కూడా ఉంటుందని వెల్లడించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మోడల్ చిత్రాలను విడుదల చేసింది. మసీదు నిర్మాణానికి పునాదిరాయి వచ్చే సంవత్సరంలో పడుతుందని, ఆపై రెండో దశలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది.
 
అయితే, పునర్నిర్మాణం తర్వాత మసీదుకు ఏ పేరు పెడతారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదని, ఏదైనా ముస్లిం చక్రవర్తి లేదా రాజు పేరిట ఇది ఉంటుందని ఐఐసీఎఫ్ (ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్) ట్రస్ట్ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోని ఎన్నో మసీదుల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఈ మసీదు ప్లాన్‌ను రూపొందించామని, భావితరాలను ప్రతిబింబించేలా ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని వెల్లడించింది.