గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (12:37 IST)

శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోసం అయ్యన్ యాప్

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల కోసం.. కేరళ అటవీ శాఖ "అయ్యన్" యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అటవీ మార్గంలో వన్యప్రాణుల దాడులు జరిగిన సందర్భాల్లో యాప్‌ ద్వారా అధికారులను సంప్రదించవచ్చని కేరళ అటవీ శాఖ పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 
 
ఈ యాప్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పనిచేస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో యాప్‌ పనిచేస్తుంది. శబరిమల వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ, వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్టులు, తాగునీటి కేంద్రాల వివరాలను ఈ యాప్‌లో పొందుపరిచారు.