సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నీరజ్ చోప్రాకు అభినందలు : ఒక రోజు ఉచిత ఆటో సవారీ.. ఎక్కడ?

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో అద్భుతంగా రాణించి దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాడు. ఈ క్రీడాకారుడు పట్ల దేశం నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే, పలు కంపెనీలు అవార్డులు, రివార్డులు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. నీరజ్ చోప్రాకు అభినందగా ఆదివారం తన ఆటోలో ఫ్రీ రైడింగ్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అతని పేరు అనిల్ కుమార్. సొంతూరు చండీఘడ్‌. 
 
ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా తన ఆటోలో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు. గత కొన్నేండ్లుగా ఆర్మీ పర్సనల్‌, గర్భిణులను ఉచితంగా తీసుకెళ్తూ శహబాష్‌ అనిపించుకుంటున్నాడు.
 
ఒకవైపు కొవిడ్‌ వ్యాప్తి భయాలు ఉన్నప్పటికీ క్రీడాకారులు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారని, అందుకే వారీ స్థాయికి చేరుకున్నారని అనిల్‌ కుమార్‌ అన్నాడు. చండీఘడ్‌లో చదువుకుని, ఆటల్లో ఓనమాలు దిద్దిన నీరజ్‌ చోప్రా.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం తమకు గర్వకారణమంటున్నాడు. 
 
నీరజ్‌ పతకాన్ని సాధించినందుకు సంతోషం ఉన్నందున తన ఆటోలో ఈ రోజు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నానని చెప్పాడు. సాధారణంగా ఒక ఆటోడ్రైవర్‌ రోజులో 150 కిలీమీటర్లు ఆటో నడిపి రూ.500 వరకు సంపాదిస్తారని, తాను సంపాదించే ఈ మొత్తాన్ని పతకం సాధించిన తీపి గుర్తుకు వెచ్చించడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పారు.