మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (13:08 IST)

కాంగ్రెస్‌తో కూడిన ఫ్రంటే: శరద్‌ పవార్‌

బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తే.. అందులో కాంగ్రెస్‌ ఉంటుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు కాంగ్రెస్‌ వంటి రాజకీయ శక్తి అవసరమని పేర్కొన్నారు.

ఇటీవల కాంగ్రెస్‌ మినహా.. ఎనిమిది ప్రధాన పార్టీల నేతలతో పవార్‌ సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంతో.. కాంగ్రెస్‌ లేని మూడో ఫ్రంట్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవార్‌ స్పందిస్తూ.. తమ సమావేశంలో అసలు ఫ్రంట్‌ ఏర్పాటుపైనే చర్చలు జరగలేదన్నారు.