గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 29 మే 2021 (20:38 IST)

నా భర్త కోరిక తీర్చు, నీ అందం తరిగిపోదులే.. కానిస్టేబుల్ భార్య నిర్వాకం

భర్త తప్పుడు మార్గంలో వెళుతుంటే హెచ్చరించి అతన్ని తన దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత భార్యపై ఉంటుంది. అలాంటిది భర్త మరొక మహిళను రేప్ చేయడమే కాదు... శారీరకంగా హింసిస్తుంటే వెళ్ళి అతని భార్యకు చెప్పింది. భర్త చేసింది తప్పని చెప్పాల్సిన భార్య అతని కోరిక తీరిస్తే నీ అందం తరిగిపోదు వెళ్ళు అంటూ బూతు పురాణం మొదలెట్టింది.
 
రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌ సింగ్ పూర్ ప్రాంతంలో నివాసముండే మణిరామ్ స్థానికంగా కానిస్టేబుల్. ఇతని పని దందాలు వసూలు చేయడమే. ఇష్టానుసారం రోడ్డుపై పడి షాపుల వారిని బెదిరించి డబ్బులు గుంజేస్తుంటాడు. ఆ డబ్బును ఉన్నతాధికారులకు కొద్దిగా ఇచ్చి మిగతా దాంతో ఎంజాయ్ చేస్తుంటారు.
 
మణిరామ్ ఉన్న ప్రాంతంలోనే ఒక వివాహిత ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అత్త ఇంట్లోనే ఉంటోంది. అయితే ఆమె అందంగా ఉంటుంది. ఆమెపై మోజు పెంచుకున్న కానిస్టేబుల్ ఆమెను బెదిరించాడు. తన కోరిక తీర్చకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపుతానన్నాడు.
 
దీంతో వివాహిత భయపడింది. ఇదే అదునుగా భావించిన మణిరామ్ వివాహిత రియా అత్త ఇంట్లో లేని సమయంలో వెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ వీడియోలు, ఫోటోలను కూడా రహస్యంగా చిత్రీకరించాడు. దాంతో ఆగలేదు. ఆ మొత్తం వ్యవహారాన్ని ఆమెకే చూపించాడు.
 
తన కోరిక తీరుస్తూనే ఉండాలని హెచ్చరించాడు. దీంతో ఆ వివాహిత కానిస్టేబుల్ భార్య దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంది. నా భర్త కోరిక తీర్చు.. నీ అందం అరిగిపోదు.. వెళ్ళు.. మళ్ళీ ఈ వైపు రావద్దు అంటూ బూతు పురాణం మొదలుపెట్టింది. దీంతో ఆ అభాగ్యురాలు కుమిలిపోతూ ఒక సెల్ఫీ వీడియోను చిత్రీకరించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. చావుబతుకుల మధ్య ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది రియా.