శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (09:44 IST)

కొత్త బిజినెస్ ప్రారంభించనున్న గోవా బ్యూటీ!

గోవా బ్యూటీ ఇలియానా. ఈమెకు హీరోయిన్ అవకాశాలు చాలా మేరకు సన్నగిల్లిపోయాయి. దీంతో ఏదో వ్యాపారం చేయాలన్న సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా, ఆమె ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఒక‌ప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ వ‌ర‌సు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా గ‌డిపిన‌ ఇల్లీ బేబీ తాజాగా పెద్ద‌గా సినిమా అవకావాలు ద‌క్కించుకోలేక వెన‌క‌బ‌డింది. యంగ్ హీరోయిన్ల రేసులో నిల‌వ‌లేక‌పోయింది. దీంతో వ్యాపారం చేయాలన్న సంకల్పంతో ఉంది. 
 
ఇందులోభాగంగా బేక‌రీ, రెస్టారెంట్ వంటి వ్యాపారం చేయాలో ఆలోచ‌న‌లో ఇలియానా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా వ్యాపార ప్రారంభం కోసం మ‌రికొంత స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఇలియానా త‌న బిజినెస్ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.