శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (16:01 IST)

గుజరాత్‌లో జూనియర్ క్లర్క్ రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

గుజరాత్ రాష్ట్రంలో జూనియర్ క్లర్ పోస్టుల భర్తీ కోసం ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన (జీపీఎస్ఎస్‌బీ) పరీక్షా ప్రశ్నపత్రం లీకైంది. దీంతో ఆదివారం జరగాల్సిన ఈ పరీక్షను వాయిదావేశారు. ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు పరీక్షా నిర్వహణ బోర్డు తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
 
కాగా, మొత్తం 1181 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను గుజరాత్ పంచాయతీ బోర్డు విడుదల చేసింది. మొత్తం 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. ఆదివారం నిర్వహించాల్సిన పరీక్ష కోసం 2995 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు పంచాయతీ రాజ్ బోర్డు తెలిపింది.