శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (12:06 IST)

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‍లో మరో విషాదకర ఘటన జరిగింది. స్థానిక శాస్త్రి మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడిని మయూర్‌గా గుర్తించారు. గత 45 రోజుల్లో ఈ తరహా ఘటనలు జరగడం ఇది ఎనిమిదోది. 
 
ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ బౌలింగ్ చేస్తుండగా, అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన మైదానంలో కొంది సేపు కూర్చొని కిందపడిపోయాడు. అతని స్నేహితులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మయూర్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, స్వర్ణకారుడైన మయూర్.. కుటుంబానికి ఏకైక ఆధారం. పైగా, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.