గురువారం, 21 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (13:21 IST)

గురుగ్రామ్‌‌లో కేఫ్ వెలుపల హనుమాన్ చాలీసా పాడిన యువత (వీడియో వైరల్)

Hanuman Chalisa
Hanuman Chalisa
ఈ రోజుల్లో యువత అత్యాధునికమైన, ఉల్లాసమైన ట్రాక్‌లకు జామ్‌ అవుతోంది. కానీ చాలా అరుదైన దృశ్యంలో, కొంతమంది యువకులు హనుమాన్ చాలీసా పాడారు. ఈ యువకులు భక్తిగీతం పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
వైరల్ వీడియోలో, గురుగ్రామ్‌లోని ఒక కేఫ్ వెలుపల అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చేతులు చప్పట్లు కొట్టి భక్తి గీతాన్ని పాడారు. 
 
మూడు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియో వైరల్ అవుతోంది. గురుగ్రామ్‌లోని ఓ కేఫ్ వెలుపల ఈ యువకులు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పఠిస్తారు.