గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (17:56 IST)

వారానికి గంట పని.. యేడాదికి రూ.40 లక్షల వేతనం?

ashok khemka
అశోక్ ఖేమ్కా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన సర్వీస్‌ అధికారి. ఈయనకు భారతదేశంలో ఉన్న ఇతర ఐఏఎస్ అధికారుల్లో కెల్లా ప్రత్యేకమైన పేరుంది. స్థానం కూడా ఉంది. దేశంలో అత్యధిక సార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారి ఈయనే. ఇటీవలే 56వ సారి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన హర్యానా రాష్ట్రంలోని పురావస్తు శాఖలో పని చేస్తున్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, తన విభాగం వార్షిక బడ్జెట్ రూ.10 కోట్లు. అంటే రాష్ట్ర బడ్జెట్‌లో 0.0025 శాతం కంటే తక్కువ. తనకు ప్రభుత్వం అదనపు ప్రధాన కార్యదర్శిగా విధులు కేటాయించింది. వార్షిక వేతనం రూ.40 లక్షలు ఇస్తుంది. ఇది తన శాఖ బడ్జెట్‌లో 10 శాతమన్నారు. 
 
పైగా, తన శాఖలో వారానికి ఒక గంటకు మించి పని లేదన్నారు. ఆ లెక్కన రోజుకు 8 నిమిషాల పని. యేడాదికి తనకు ఇచ్చే వేతనం రూ.40 లక్షలు. కొందరు అధికారులకు తలకు మించిన పని వుంటే, మరికొందరు అధికారులకు పని లేదన్నారు. దీనివల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరన్నారు. ప్రస్తుతం దేశానికి పట్టిన అవినీతి కేన్సర్‌ను వదిలించాలనే తాను తన కెరీర్‌ను ఫణంగా పెట్టానని చెప్పారు. ఈ విషయంలో విజిలెన్స్ విభాగంతో కలిసి పనిచేయాలని వుందని చెప్పారు.