మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలి.. లేకుంటే రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం
ఈ నెలాఖరు లోగా పాన్ కార్డు - ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని లేనపక్షంలో రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు కార్డుల అనుసంధానం కోసం ఈ నెల 31వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెల్సిందే. ఈ గడువులోగా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ చేయని పక్షంలో పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. డెడ్‌లైన్ తర్వాత ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలంటే వెయ్యి రూపాయల నుంచి రూ.10 వేల వరకు అపరాధం చెల్లించి లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రెండు కార్డుల అనుసంధానం కోసం గడువును పలుమార్లు పొడగించిన విషయం తెల్సిందే. అయితే, ఈ నెలాఖరు తర్వాత ఈ గడువును కేంద్ర ప్రభుత్వం పొడగిస్తుందో లేదో వేచి చూడాల్సివుంది. అనుసంధానం ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు.
ముందుగా వెబ్‌బ్రౌజర్‌లో ట్యాక్స్ ఈ-ఫిల్లింగ్ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in అనే వెబ్‌సైట్లోకి వెళ్లారి. ఆ తర్వాత క్విక్ లింక్ అనే సెక్షన్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
అలా చేసిన తర్వాత పాన్ నంబరు, ఆధార్ నంబరు, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నింబంధనలను అంగీకరిస్తున్నట్టుగా బాక్స్‌లో టిక్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే లింక్ ఆధార్ బటన్‌ను క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులు లింకు అయినట్టుగా ఆధార్ కార్డులోని మొబైల్ నంబరుకు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది.