మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (20:56 IST)

వేరొక మహిళతో భర్త షాపింగ్.. భార్యకు అడ్డంగా దొరకడంతో..?

భార్యాభర్తల మధ్య అనుబంధాలు సన్నగిల్లుతున్నాయి. ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. తద్వారా నేరాలు, మనస్పర్ధలు, విడాకులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మరో మహిళతో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా భర్త దొరికిపోవడంతో అందరి ముందే ఆ భర్త తలదించుకోక తప్పలేదు. భార్యాభర్తల గొడవ క్లాంపెక్స్‌లో చోటుచేసుకోవడంతో వారు ఘర్షణకు దిగడంతో పోలీసులు ఎంటరవ్వాల్సి వచ్చింది. 
 
ఈ ఘటన యూపీలోని మీరట్‌లో వెలుగుచూసింది. భార్యాభర్తల గొడవ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరట్‌ సెంట్రల్‌ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అద్నాన్‌ అనే వ్యక్తి వేరే మహిళతో మార్కెట్‌కు రాగా ఆయన భార్య ఆయేషా వారిద్దరినీ పసిగట్టింది. దీంతో భార్యాభర్తలు వాదులాడుకుంటుండగా చుట్టూ జనం పోగయ్యారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. 
 
పోలీస్‌ స్టేషన్‌లోనూ ఆ జంట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ నడుస్తోందని, తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.