అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి
అనంత పద్మనాభ స్వామి దేవాలయ కొలనులో ఓ మొసలి ప్రత్యక్షమైంది. ఈ కొలనులో ఆలయ అధికారులు, సిబ్బందికి ప్రమేయం లేకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఒక మొసలి వచ్చి ఉంటుంది. భక్తులకు ఎవరికి హాని చేయని శాకాహార మొసలి ఈ కొలనులో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గతంలో ఈ కొలనులో బబియా అనే ఒక మొసలి ఉండేది. ఆ మొసలి పండ్లు పలహారాలు తప్ప మరేమీ తినేది కాదు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ప్రస్తుతం ఈ మొసలి స్థానంలో కొత్తది వచ్చింది. ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి ప్రత్యక్షం కావడం ఎంతోకాలంగా అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో జరుగుతుంది.