బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (08:18 IST)

ఇండిగో విమానానికి అత్యవసర ల్యాండింగ్

indigo
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఇండిగో విమానం కొద్ది నిమిషాల్లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ విమానాన్ని కిందికి దించేశారు. ఇందులోని ప్రయాణికులంతా క్షేమంమగా ఉన్నారని ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
 
కాగా, ఈ విమానం నాగ్‌పూర్ నుంచి లక్నోకు మంగళవారం ఉదయం బయలుదేరింది. బయలుదేరిన కొన్ని నిమిషాల్లో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలెట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూమ్ అధికారులకు చేరవేసి, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి తీసుకుని విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. 
 
కాగా, ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత విమానం నుంచి పొగలు వచ్చాయి. ఈ కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీనిపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విభాగం విచారణకు ఆదేశించిందని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.