ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (18:52 IST)

దీపాలు వెలిగించండి.. సమైక్యతను చాటండి.. సీఎం జగన్

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీలోని మర్కజ్‌ సమావేశానికి వెళ్లినవారిలో అనేకమందికి కరోనా సోకడం దురదృష్టకరమని సీఎం జగన్ అన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయని చెప్పారు. 
 
ఇలా వైరస్‌ సోకడాన్ని అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించాలని చెప్పారు. కరోనా కాటుకు కులం మతం, ప్రాంతం, ధనిక, పేదా తేడా లేదని జగన్‌ పేర్కొన్నారు. కంటికి కనిపించని వైరస్‌పై మనమంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రేపు రాత్రి 9 గంటలకు వెలిగించే దీపాలు మన సమైక్యత చాటాలన్నారు.
 
అలాగే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు అందరూ ఆదివారం రోజు దీపాలు వెలిగించాలని కోరారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి దీపాలు వెలిగించాలని కోరారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. కరోనా బాధితులను వింతగా చూడొద్దని.. ఆప్యాయతగా చూడాలన్నారు.