గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్.. నేడు ప్రమాణం

DY Chandrachud
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమలో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 
 
కాగా, ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్టిస్ యుయు లలిత్ సోమవారంతో పదవీ విరమణ చేసిన విషయం తెల్సిందే. ఆయన తన వారుసుడిగా చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. దీంతో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పేరును కేంద్రం అధికారికంగా ప్రటించిన విషయం తెల్సిందే. 
 
సుదీర్ఘకాలంగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్న జస్టిస్ చంద్రచూడ్ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయాధీశుడుగా రెండున్నరేళ్ల పాటు సేవలు అందిస్తారు. 1988లో అదనపు  సొలిసిటర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
 
ఈయన గతంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. దేశంలో కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) వంటి కేసుల్లో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులను వెలువరించారు. ీ