మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (15:08 IST)

ప్రధానిపై విమర్శలు.. ప్రకాశ్ రాజ్‍‌పై కేసు... అరెస్ట్ కూడా చేయాలట

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని.. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కర్ణాటకలో బీజే

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని.. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కర్ణాటకలో బీజేపీ పాలనలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ముగ్గురు సీఎంలు మారారని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు.


కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కొన్ని రోజులు బీజేపీ హవా వుందని.. అప్పుడు హవా ఇప్పుడు లేదని, ప్రచారపర్వంలో దూసుకోపోయే మోదీ, కర్ణాటకలో కేవలం ఐదు రోజులకే పరిమితమవుతున్నారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. 
 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని అరాచకాలు జరగుతున్నాయో అందరికీ తెలుసని ప్రకాశ్ రాజ్ చెప్పారు. చెన్నైలో తమిళులకు భయపడిన మోదీ... రోడ్డుపై కాకుండా హెలికాప్టర్‌లో ప్రయాణం చేశారని ఎద్దేవా చేశారు.
 
ఇదిలా ఉంటే.. నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించాడని, ఈ విషయమై వెంటనే విచారించి ఆయన్ని అరెస్ట్ చేయాలని కర్ణాటక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నేత గణేష్ యాజి పోలీసులతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ప్రతిని పంపించారు. మోదీతో పాటు తమ నేత యడ్యూరప్పపైనా ప్రకాష్ రాజ్ అనుచిత విమర్శలు చేశారని తెలిపారు. 
 
గుజరాత్ ఎమ్మెల్యే జిజ్ఞేష్ మెవానిపైనా ఆయన ఫిర్యాదు చేశారు. మరోవైపు బీజేపీ నేత ఈశ్వరప్ప, సీఎం సిద్దరామయ్యను అసభ్య పదజాలంతో దూషించారని ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఇలా ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది.