గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (07:21 IST)

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మ : సుబ్రహ్మణ్యం స్వామి

భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి కేంద్రప్రభుత్వానికి సూచించారు. అలా చేస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. సుబ్రహ్మణ్యం స్వామి మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వాలో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ శీర్షికతో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మ ముద్రించిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవలసిన అవసరం లేదన్నారు.