ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (15:31 IST)

సిద్ధరామయ్య కారుపై కాకి వాలింది.. కొత్త కారొచ్చింది.. బిడ్డపోయాడు.. చేతిలో నిమ్మకాయతో?

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కారుపై జూన్‌ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్‌ తరిమికొట్టినా వెళ్లకుండా.. దాదాపు 10 నిమిషాల పాటు కారుపై కూర్చొండిపోయిందా కాకి. దీంతో ఈయన కొత్తకారు కొనుక్కోవడం అప్పుడు రాష్ట్రంలో చర

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కారుపై జూన్‌ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్‌ తరిమికొట్టినా వెళ్లకుండా.. దాదాపు 10 నిమిషాల పాటు కారుపై కూర్చొండిపోయిందా కాకి. దీంతో ఈయన కొత్తకారు కొనుక్కోవడం అప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో వింత ఘటన చోటుచేసుకుంది.
 
ఈ మధ్యకాలంలో సిద్ధరామయ్య ఎక్కడికి వెళ్లినా తన చేతిలో నిమ్మకాయని తీసుకెళ్లడం అందరిని భయభ్రాంతులకి గురిచేస్తుంది. మైసూరులోని రామకృష్ణ నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన సీఎం మంత్రించిన నిమ్మకాయను చేతితో పట్టుకుని వచ్చారు. దీంతో అక్కడున్నవారికి నోట మాటరాలేదు.
 
అసలు మూఢనమ్మకాలను నమ్మని మనిషి ఒక్కసారిగా దైవచింతనకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని సన్నిహితులు అంటున్నారు. దీనికి ముఖ్యకారణం కూడా లేకపోలేదు. కుమారుడు రాకేశ్ మరణం ఆయనను మానసికంగా కుంగదీసింది. దీంతో ఆయన నివాస ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ తర్వాత మంత్రించిన నిమ్మకాయను ఆయన చేతిలో పట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. మైసూరు టికె లే అవుట్‌లోని సీఎం నివాసంలో ప్రతిరోజూ ఏదోరకమైన పూజలు నిర్వహిస్తున్నారు. 
 
అయితే సీఎంకు అత్యంత ఆప్తులైన కొందరు మాత్రం మూఢనమ్మకాల విషయంలో సిద్దూ తీరు మారలేదని పూజ చేసి బయటకు వచ్చిన సందర్భంగా ఆయన నిమ్మకాయతో మీడియాకు కనిపించారని దీన్ని భూతద్దంలో చూపడం సరికాదని వాదిస్తున్నారు. అయితే మూఢనమ్మకాలను దరిచేరనివ్వని ఆయన ఇలా చేతిలో నిమ్మకాయతో హాజరుకావడం మాత్రం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.