లఖింపూర్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరపాలని యూపీ రాష్ట్ర న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణకు మంగళవారం లేఖ రాశారు.
ఈ దారుణంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా హోంమంత్రిత్వశాఖను ఆదేశించాలని న్యాయవాదులు కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మంత్రులను శిక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అజయ్, ఆయన కుమారుడుపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.