శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (11:39 IST)

ఎనిమిదో తరగతి విద్యార్థితో జంప్ అయిన 26 ఏళ్ల టీచర్

ఉపాధ్యాయ వృత్తికి ఓ ఉపాధ్యాయురాలు కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు.. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంకా స్కూలు నుంచి అతనితో పారిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూలుకెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తండ్రి అసలు విషయం తెలిసి షాకయ్యాడు. 
 
ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలలో తన కుమారుడికి పాఠాలు చెప్పకుండా మాయమాటలు చెప్పి.. కుమారుడిని వలలో వేసుకుందని.. విద్యార్థి తండ్రి ఆరోపించాడు.  ఏడాదిగా ఈ తతంగం నడుస్తున్నా తను గుర్తించలేకపోయానని వాపోయాడు. వారిద్దరినీ పట్టుకుని తన కుమారుడిని తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా టీచర్‌కు 26 సంవత్సరాలని.. ఏడాది పాటు ఎనిమిదో తరగతి కుర్రాడితో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.