మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (16:44 IST)

రోడ్డు ప్రమాదంలో గాయపడితే పూర్తి ఖర్చు మాదేనంటున్న మధ్యప్రదేశ్ సీఎం?

భోపాల్: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స అందించనున్నారు. కమల్ నాథ్ ప్రభుత్వం రోడ్డు ప్రమాద బీమా పథకాన్ని త్వరలో ప్రారంభించబోతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి  ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత చికిత్స లభిస్తుందని ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిసి శర్మ శుక్రవారం సమాచారం ఇచ్చారు.
 
క్షతగాత్రులకు అయ్యే చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయబడిందనీ, త్వరలో సామాన్య ప్రజలు ఈ బీమా ద్వారా లబ్ది పొందే అవకాశం వుంటుందన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, పైలట్ ప్రాజెక్ట్ కింద, ఈ పథకాన్ని మొదటి ఐదు జిల్లాల్లో ప్రారంభిస్తారు. భోపాల్, ఇండోర్, చింద్వారా, సత్నా మరియు రేవాలో ప్రవేశపెట్టిన తర్వాత పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.
 
ప్రమాదం జరిగిన 24 నుంచి 46 గంటల మధ్యలో గాయపడిన వారి ప్రాణాలను కాపాడటానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతాయి. ఇందులో ప్రభుత్వం గాయపడిన వారికి 30 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇందుకోసం జిల్లాలోని పెద్ద ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రోడ్డు ప్రమాద బీమా సంస్థను మూడేళ్లపాటు ఎంపిక చేస్తారు. దీని తరువాత, మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మళ్లీ టెండర్ జారీ చేస్తుంది, టెండర్‌లో అతి తక్కువ ప్రీమియం వసూలు చేసే సంస్థను ఎంపిక చేస్తారని తెలిపారు.