ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (18:26 IST)

కోడలిపై మామ అత్యాచారం..

rape
దేశంలో రోజు రోజుకీ అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోయి దారుణాలకు ఒడిగుడుతున్నారు. తాజాగా కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాకు చెందిన ఓ యువతికి గత సంవత్సరం పెళ్లి అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆమెపై మామ కన్నేశాడు.
 
లైంగికంగా వేధించేవాడు. చివరకు గత నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కొడుకుకు చెప్పినా అతను పట్టించుకోకపోవడమే కాకుండా ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొడుకు పరారీలో ఉన్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.