ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (09:46 IST)

మహారాష్ట్ర భారీ వర్షాలు.. 48 మంది మృతి.. భారీగా పంట నష్టం

కరోనా ఒకవైపు, భారీ వర్షాలు మరోవైపు మహారాష్ట్రను పట్టి పీడిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలోని ముంబై నగరం మొత్తం తీవ్రంగా జలదిగ్బంధంలో లోకి వెళ్ళిపోయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబైలోనే కాకుండా పూర్తిగా మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. 
 
ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గినప్పటికీ ఆ వరద ప్రభావం మాత్రం ఇప్పటికీ కూడా తగ్గడం లేదు. దీంతో ఎంతో మంది ప్రజలు ఇప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న జనాలు ప్రస్తుతం వరదలతో కూడా మరింత భయాందోళనకు గురవుతున్నారు.
 
అది మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏకంగా మూడు రోజుల వ్యవధిలో 48 మంది వరకు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక వరదల్లో చిక్కుకుపోయిన 40 వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.