సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (00:16 IST)

ఆరేళ్ల బాలికపై వ్యక్తి లైంగిక దాడి- CCTVలో నిందితుడు

దేశ రాజధాని ఢిల్లీలో వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆరేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంజిత్‌ నగర్‌కు చెందిన ఆరేండ్ల బాలిక శుక్రవారం ఉదయం టిఫిన్‌ చేసేందుకు సమీప ప్రాంతానికి వెళ్లింది. 
 
ఆమె తిరిగి ఇంటికి రాగా రక్తస్రావం అవుతున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో నిందితుడు సీసీటీవీలో కనిపించాడు. అతడి వెనుక ఆ బాలిక వెళ్తున్నట్లు అందులో ఉన్నది. అయితే ఆ నిందితుడు ఎవరు అన్నది ఇంకా గుర్తించలేదు. కాగా, ఈ కేసు నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.